తొలి గంట తల్లిపాలు – బిడ్డ ఆరోగ్యానికి అమృతం

Aug 5, 2026 - 16:34
 0  1
తొలి గంట తల్లిపాలు – బిడ్డ ఆరోగ్యానికి అమృతం
తొలి గంట తల్లిపాలు – బిడ్డ ఆరోగ్యానికి అమృతం

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలం పరిధిలోని చాగాపురం గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లి పాల వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ  తల్లికి మించిన దైవం లేదు- అమ్మ పాలకు మించిన ద్రవం లేదు. తొలి వరం - కమ్మనైన క్షిరం  ఈ సంవత్సరం ప్రధాన అంశం:-  జీవితానికి సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు-  అనే నినాదంతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈనెల 7 వరకు జిల్లా వ్యాప్తంగ ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాల తల్లి పాలు శిశువుకు సంపూర్ణమైన, సురక్షితమైన ఆహారమని, బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సూచించారు.

బిడ్డకు ఎంత ఎక్కువగ తల్లిపాలు ఇస్తే అంత ఎక్కువగ పాల ఉత్పత్తి అవుతుందని గర్భిణీ స్త్రీలకు వివరించారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, నీళ్ల విరేచనాలు, న్యుమోనియా, మధుమేహం, అలర్జీలు వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అవగాహన కల్పించారు. అలాగే తల్లి–బిడ్డల మధ్య అనుబంధం బలపడటంతో పాటు పిల్లల్లో జ్ఞాపకశక్తి, చురుకుదనం, కంటి చూపు, భద్రతాభావం మెరుగుపడతాయని గర్భిణీ స్త్రీలకు  వివరించారు. తల్లులు పిల్లలకు పాలివ్వడం వల్ల గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల ప్రమాదం తగ్గడంతో పాటు మధుమేహం, అధిక బరువు, మానసిక ఒత్తిడి తగ్గుతాయని తెలిపారు. ప్రసవానంతరం రక్తస్రావం తగ్గడం, రక్తహీనత నివారణ, గర్భాశయం త్వరగ సాధారణ స్థితికి రావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.

ప్రతి గర్భిణీకి, బాలింతకు విజయవంతమైన తల్లిపాల కోసం పాటించాల్సిన 10 సూత్రాలపై అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడానికి సహాయం చేయాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. తల్లిపాలు కాకుండ ఇతర ఆహారం లేదా పానీయాలు ఆరు నెలల వరకు ఏవి కూడ ఇవ్వకూడదని గర్భిణీ స్త్రీలకు వివరించారు. బిడ్డ కోరిన ప్రతిసారి తల్లిపాలు ఇచ్చుటకు ప్రోత్సహించాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ రాఘవేంద్రమ్మ ఉమా చంద్రకళ గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333