తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు 

Sep 30, 2024 - 18:23
 0  4
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

సూర్యాపేట:-తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని జిల్లా కేంద్రంలోని మహర్షి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పల్లె నగేష్ అన్నారు. సోమవారం మహర్షి డిగ్రీ కళాశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ సొంతమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజిస్తామని తెలిపారు.తెలంగాణ ఆడపడచులు అందరూ సంతోషంగా జరుపుకునే పెద్దపండుగ బతుకమ్మ అన్నారు.బతుకమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు కలిసి బతుకమ్మ పాటలను ఆలపిస్తూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జిన్నె రమాదేవి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333