పోలింగ్ జరిగే మండలాల్లో స్థానిక సెలవు జిల్లా కలెక్టర్ సంతోష్

Dec 11, 2025 - 13:20
 0  3
పోలింగ్ జరిగే మండలాల్లో స్థానిక సెలవు జిల్లా కలెక్టర్ సంతోష్

 జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల  గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లో పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్  బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, గట్టు, కేటీ డొడ్డి మండలాల్లో పోలింగ్ జరిగే ఈ నెల 11వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. రెండవ విడతలో  ఐజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో పోలింగ్ జరిగే ఈనెల 14న ఆదివారం, ముందు రోజు 13న రెండవ శనివారం సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగే ఆలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవల్లి మరియు మానవపాడు మండలాల్లో పోలింగ్ రోజు ఈ నెల 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ముందు రోజు 16వ తేదీన అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. సెలవులను వినియోగించుకొని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333