తుంగతుర్తి నూతన తహసిల్దారుగా పి. దయానందం బాధ్యతలు స్వీకరణ

తుంగతుర్తి:సెప్టెంబర్ 13తెలంగాణ వార్త ప్రతినిధి:-తుంగతుర్తి మండల నూతన తహసీల్దార్‌గా పి.దయానందం శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. బదిలీల్లో భాగంగా జనగాం జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ రమణారెడ్డి బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులం, ఆదాయ ధ్రువ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేసి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది తో సమావేశమయ్యారు. సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఆఫీసు సిబ్బంది నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు.