తుంగతుర్తి నియోజకవర్గం లో అడుగుపెట్టనీయం

Oct 22, 2025 - 21:27
 0  332
తుంగతుర్తి నియోజకవర్గం లో అడుగుపెట్టనీయం

తిరుమలగిరి 23 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 

హైదరాబాద్ లోని బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పై, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పై, మంత్రి కొండ సురేఖ పై చేసిన వ్యాఖ్యల పట్ల తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ , తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, నూతనకల్ మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు నిన్ను 50 వేల పైచిలుకు మెజార్టీతో ఓడ కుట్టిన కూడా బుద్ధి రాలేదు అని మా కాంగ్రెస్ పార్టీ సీఎం మంత్రులపై ఎంపీపై మాట్లాడిన తీరు నీ భాష మార్చుకోవాలని లేకుంటే తుంగతుర్తి నియోజకవర్గం లో అడుగు కూడా పెట్టనీయమని హెచ్చరించారు. మాజీ సీఎం కెసిఆర్ బిడ్డ కవిత ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకులు హరీష్ రావు పెద్ద అవినీతిపరుడు అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని గుర్తు చేశారు.   కాలేశ్వరంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడ  ఎక్కడున్నావు అని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గం లో నిన్ను దొంగ నోట్ల కిషోర్, భూకబ్జాల కిషోర్, నయీమ్ గ్యాంగ్ కిషోర్, హంతకుడు కిషోర్, ఇసుక మాఫియా కిషోర్ అని అంటారని, నీకు లేని ముద్రలు లేవని ఘాటుగా విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ హయంలో నియోజకవర్గంలో నువ్వు చేసిన అవినీతి పట్ల ప్రజలు తిరస్కరించి పంపించారని గుర్తు చేశారు. మా కాంగ్రెస్ నాయకులపై ఏ ఒక్కరిపై కూడా మాట్లాడే అర్హత నీకు లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్, సేవా దళ్ అధ్యక్షులు యాదగిరి, ఎర్ర యాదగిరి, నరసింహ రెడ్డి,మల్లయ్య, వంశీ, గదరబోయిన లింగయ్య యాదవ్, దుపల్లి అబ్బాస్, భాస్కర్ నాయక్,  జేరిపోతుల యాదగిరి మండల నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి