తిరుమలగిరి మండల ప్రజలు అప్రమత్తం ఎస్సై వి సురేష్

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రం మరియు మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఎస్సై వి సురేష్ తెలిపారు ఏదైనా అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు తగు సూచనలు జాగ్రత్తలు సూచించారు
1) పాతబడ్డ ఇండ్లలో ఎవరైనా నివసిస్తున్నచో వారు కొద్ది రోజులు మీకు తెలిసిన వారి ఇంట్లో నివాసం ఉండగలరు.
2)కరెంటు స్తంభాల దగ్గరకు మరియు కరెంటు పనిముట్ల దగ్గరకు ఉండరాదు
3) ఎక్కడైనా చెట్లు విరిగిపడిన మరియు స్తంభాలు విరిగిపడిన కరెంటు వైర్లు తెగిపడిన వెంటనే విద్యుత్ అధికారులకు గ్రామ అధికారులకు మరియు పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు
4) ఎక్కడైనా అధిక వర్షాలకు చెరువుల నుండి వాగులు పొంగిపొర్లుతున్నచో వాటి పక్కన ఉన్న రోడ్లపైకి వెళ్ళరాదు
5) రోడ్డుపై వాహనాలలో వెళ్లేటప్పుడు చిన్నగా మరియు జాగ్రత్తగా వెళ్లగలరు.
6)అనవసరంగా ఇంటి నుండి బయటికి రారాదు.
7) వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందికి స్తంభాల కిందకి వెళ్ళరాదు వెళ్లి పిడుగుపాటుకు గురి కాకూడదు.
పైన ఉన్న సూచనలను పాటించాలని తిరుమలగిరి ఎస్సై సురేష్ తెలిపారు.