అయిజ భారతీయ జనతాపార్టీ సభ్యత్వలను రికార్డు స్థాయిలో నమోదు చేయాలి.

భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో, అయిజ పట్టణ కో-కన్వీనర్ కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, సభ్యత్వ నమోదు కార్యశాల జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దేవదాసు నాయుడు హాజరై, వారు మాట్లాడుతూ,
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2వ తేదీన సభ్యత్వ నమోదు కార్యశాలను ప్రారంభించనున్నారు.
భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, బూతు స్థాయి నాయకులు అందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చెయ్యాలని అన్నారు. అలాగే రానున్న ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ఎక్కువ సీట్లను గెలవడానికి ప్రజలతో సంబంధాలను పెంచుకోవాలని సూచించారు.
ఈ సభ్యత్వ నమోదుకై 8800002024 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి, దాని తర్వాత వచ్చిన లింకును వారి యొక్క పూర్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎన్నో వివిధ పథకాలను తీసుకొచ్చారని వాటిని ప్రజలకు వివరించాలని,
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, ముందంజలో ఉంటూ ప్రతి బూత్ నుంచి 200కు పైగా సభ్యత్వాలను చేయించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు నరసింహ శెట్టి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు లక్ష్మణాచారి, జిల్లా బిజేవైఎం ఉపాధ్యాయులు లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, వివిధ బూత్ అధ్యక్షులు కనికే రాజశేఖర్, తెలుగు నరసింహ,మధు, రఘు, ఎం.శేఖర్, రాజు, కే.వెంకటేష్, భీమేష్, ఇబ్రహీం, టి.ఎల్లప్ప, టీ.ఉరుకుందు, టీ.దివాకర్, టి.లక్ష్మన్న, టి.వీరన్న, టి.మనీష్, టి.సవారి, పి.వెంకటేష్ మరియు క్రియాశీలక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.