తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం:జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు
ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ .

జోగులాంబ గద్వాల 10 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఎస్పీ కార్యాలయానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పై వచ్చిన 06 మంది భాదితుల సమస్యలను. డి .ఎస్పి మోగిలయ్యా, ఆలంపూర్, గద్వాల , శాంతి నగర్ సర్కిల్ అధికారుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో విచారణలో ఏలాంటి జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.