ఢిల్లీలో విజయం పట్ల బిజెపి సంబరాలు

సూర్యాపేట ప్రతినిధి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శనివారం విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని నాయకులకు స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.. అనంతరం నాయకులు కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కీర్తిస్తూ నినాదాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన ఆమ్ఆద్మీ పార్టీని అవినీతికి పాల్పడినందుకే ఓడించారన్నారు. స్వయంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ను ఓడించారంటే ప్రజలు అవినీతిని సహించరు అనే విషయం మరోసారి స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దేశంలో బలహీనమైతుందన్న విషయం మరోసారి బహిర్గతమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోతుందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, కేవలం ఒకే ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ నూ కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి ఆబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సంద్యాల సైదులు, తాళ్లపల్లి మధు, మాధవరపు అనిల్, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్ ,జిల్లా కౌన్సిల్ సభ్యులు పందిరి రామ్ రెడ్డి, ఉప్పు శ్రీనివాస్, రాపర్తి వెంకన్న, పేర్వాల లక్ష్మణరావు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నెమ్మది నరేష్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గుండాగాని జానీ గౌడ్, జిల్లా నాయకులు కోడి లింగయ్య, బండపల్లి శ్రీనివాస్, నూకల శైలేందర్, వాంకుడోత్ శ్రీనివాస్, పిడమర్తి నాగేశ్వరి, పెండ్ర కృష్ణ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.