డ్రైనేజ్ మీదే రెస్టారెంట్ నిర్మాణం చర్యలు శూన్యం
నోటీసులు అందచేసినం అంటున్నారే తప్ప ఆచరణ లేదు
ఇప్పటివరకు ఈ నిర్మాణానికి దరఖాస్తు అందలేదు అంటున్న అధికారులు
అఖిలపక్ష నాయకులు కూడా అక్రమ నిర్మాణాలను ఖండించాలి
సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ వారు కూడా స్పందిస్తే బాగుంటుంది
రమ నిర్మాణం ద్వారా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు కదా
కొత్తగూడెం పట్టణ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు
మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణం
కొత్తగూడెం ఆగస్టు 1( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 143 27వ వార్డులో పోస్ట్ ఆఫీస్ నుండి హెడ్ ఆఫీస్ వెళ్లే రోడ్డు పక్కన డ్రైనేజ్ మీదనే రెస్టారెంట్ నిర్మాణం అన్ని అంగులతో అనుమతులు లేకుండానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పేదవారు చిన్న గుడిసె వేసుకుంటేనే వెంటనే స్పందించి కూల్చివేసే మున్సిపల్ అధికారులు మెయిన్ రోడ్డు మీదనే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూనే వారికి వెసులుబాటు కల్పిస్తూ అక్రమ నిర్మాణదారులకు పరోక్షంగా వారికి సహకరిస్తున్నారు. ప్రజలచే ఏర్పడ్డ ప్రభుత్వాలు అసలు పనిచేస్తున్నాయా ప్రజలు అధికారులను చులకనగ చూస్తున్నారంటే ఇటువంటి సంఘటనలే నిదర్శనం.మరి ఈ రెస్టారెంట్ కి అనుమతులు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే అసలు రెస్టారెంట్ కి అనువైన స్థలమేనా దీన్ని ఏ ఒక్క అధికారి కూడా గమనించకపోవడం విచారకరం. డ్రైనేజీ మీదనే ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది.. డ్రైనేజ్ పై నిర్మాణాన్ని ఆపివేస్తామని నోటీసులు అందజేసి త్వరలోనే కూల్చివేస్తామని 15 రోజులు అవుతుంది మరి నోటీసులు ఇచ్చినరు ఎప్పుడు కూల్చేదెప్పుడు .డ్రైనేజీ పక్కన నిల్చోవాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటిది ఈ స్థలంలో ఈ డ్రైనేజీ మీదనే రెస్టారెంట్ ఏర్పాటు చేస్తుండడంతో పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మనుషులు తినడం కొరక లేక దేనికొరకు ఈ రెస్టారెంట్ నిర్మాణం .చిన్న చిన్న కాలువలు ఉన్న దగ్గరే అనేక దుర్గంధ వాసన దోమలతో సతమవుతూ ఉంటాము కానీ ఇక్కడ హైవే రోడ్డు పక్కన మెయిన్ డ్రైనేజీ దాని పైననే అనుమతులు లేకుండానే రెస్టారెంట్ నిర్మాణాన్ని చేస్తున్న కొత్తగూడెం మున్సిపాలిటీ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వారి పనితనానికి నిదర్శనం. అక్రమ నిర్మాణాలు ప్రోత్సవించాం అని చెబుతూనే ఇటువంటివి జరుగుతున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ అధికారులు. ఒక రెస్టారెంట్ నిర్మాణం జరగాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది మరి డ్రైన్ ప్రక్కనే ఈ రెస్టారెంట్ నిర్మిస్తుండడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిమిషన్ ఇవ్వకపోవచ్చు అంటే రెస్టారెంట్ కి అనుమతి లేనట్టే. మరి మెయిన్ రోడ్డు మీదనే ఇంత తతంగం జరుగుతున్న కొత్తగూడం మున్సిపల్ అధికారుల కను దృష్టి పడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రతి మున్సిపల్ అధికారి ఈ అక్రమ నిర్మాణం జరిగే రెస్టారెంట్ ముందు నుండే మున్సిపల్ ఆఫీసుకి వెళ్లాలి మరి వీరి దృష్టి ఇటు ఒక్కసారైనా పడలేదంటారా? ఒకవేళ పడిన నాకేంటి లే అని అనుకున్నారా ఏమో కానీ నిర్మాణం మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా కొత్తగూడెం మున్సిపల్ అధికారులు డ్రైనేజీ పై నిర్మిస్తున్న రెస్టారెంట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయవలసిందిగా పలువురు కోరుచున్నారు. కొత్తగూడెం పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని మున్సిపల్ అధికారులు చెబుతూనె ఉన్నారు మరి ఇటువంటి అనుమతులు లేని బిల్డింగులు రెస్టారెంట్లను మున్సిపల్ అధికారులు ఉంచుతారా తీసివేస్తారా ప్రజలకు ఈ ప్రభుత్వ అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే. కొత్తగూడెం మున్సిపాలిటీ అవినీతి పై సందేహాలు వెలిబుచ్చిన సేవ్ కొత్తగూడెం నాయకులు కూడా స్పందిస్తే ప్రజల దృష్టిలో హీరోలు అవడం ఖాయామే. కొత్తగూడెం టౌన్ ప్రజలందరూ ఇటువంటి సంఘటనలను గమనిస్తూనే ఉంటారు. ఇప్పటివరకు అసలు నిర్మాణానికి దరఖాస్తు కూడా అందలేదని మున్సిపల్ అధికారులు చెప్పడం గమనహారమే. జిల్లా రెవెన్యూ అధికారులైన స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయవలసిందిగా ప్రజలు కోరుచున్నారు.