డి రేపాక గ్రామంలో పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి 

May 17, 2025 - 19:03
 0  190

అడ్డగూడూరు 17 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో శుక్రవారం రోజు ఉరుములతో కూడిన వర్షం కారణంగా పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి చెందాయి అట్టి విషయం గొర్రెల కాపరి బాధితులు అధికారులకు విషయం తెలపగా వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్న పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి, ఆర్ ఐ రాజేష్, గొర్రెలను పరీక్షించారు. అనంతరం వాటిని పంచనామా చేసి పై అధికారులకు రిపోర్ట్ లు పంపారు. గొర్రెల కాపరి యజమానులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నుండి నష్టపరిహారాన్ని అందజేస్తామని పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333