డిసిసి.కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా.

Sep 5, 2026 - 19:26
 0  2
డిసిసి.కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా.

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ప్రజా బంగ్లా లో డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆదేశానుసారం శనివారం భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ. ఆయన విద్యారంగ అభివృద్ధికి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకు సర్వేపల్లి రాధాకృష్ణన్  అందించిన సేవలను కొనియాడుతూ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, మధు నాయుడు, టిపిసిసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ధరూర్ రవి,కొత్త గణేష్,జహంగీర్,మోహిన్,ఎండి.మహబూబ్,యోన,ఆనంద్ రాజ్,పరుశ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333