జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడుకృష్ణ కు
వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అభినందనలు.
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండలంలోని వావిలాల గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కు వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి అంకిత భావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న మీకు జిల్లా ఉత్తమ అవార్డు అందడం మాకు ఎంతో గర్వంగా ఉందని వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం మీ సేవలకు లభించిన సముచిత గుర్తింపు ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తూ విద్యారంగంలో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.