జీవామృతంతో పంటలకు ప్రాణం

Sep 1, 2026 - 20:16
 0  5
జీవామృతంతో పంటలకు ప్రాణం

నర్సాపూర్ 01 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట్ గ్రామంలో  మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ విద్యార్థులు రైతులకి జీవామృతం పై అవగాహన కల్పించారు.జీవామృతంతో నేల సారవంతమవ్వడమే కాకుండా,పంటలకు సరైన పోషణ లభిస్తుందని తెలిపారు. జీవామృతాన్ని స్వయంగా తయారు చేసి రైతులకు చూపించారు.విద్యార్థులు మాట్లాడుతూ జీవమృతం నేలలో సుక్ష్మజీవుల సంఖ్యను పెంచి మొక్కలకు అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుందన్నారు.రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవామృతాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తేజశ్రీ,శ్రీవాణి, పూజిత,హారిక,కౌలిక, స్పందన,సాక్షిలతో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333