జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ బలంగా

స్వచ్ఛంద సంస్థలకు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం కలెక్టర్

Oct 21, 2024 - 14:00
 0  12
జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ బలంగా

జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థకు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మంచు లక్ష్మి జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థ కు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి,ముఖ్యంగా గట్టు మండలంలో మీ ఫౌండేషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి అన్నారు. మీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలన్నింటినీ నేరుగా సందర్శిస్తామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కొత్తగా 140 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి మంచి అందించే విధంగా, విస్తృతంగా పర్యటించి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.  విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించే విద్యార్థులందరూ పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించి రాబోవు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ రావు‌, జెడ్పీ సి.ఈ.ఓ కాంతమ్మ, డి.ఈ.ఓ రవీందర్, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333