జిల్లాలోని దివ్యాంగులకు ఉచితంగా ఉపకారణాలు కొరకు దరఖాస్తులు
జోగులాంబ గద్వాల 20 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లాలోని దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంసిఆర్ చప్పల్స్, స్మార్ట్ కేన్స్,వాకింగ్ స్టిక్స్,క్రచెస్,హియరింగ్ ఎయిడ్‌లు, వీల్ చైర్లు,మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్ కోసం రూ.100 బాండ్ పేపర్‌పై నిరుద్యోగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అర్హులైన దివ్యాంగులు ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు https:///obmms.cgg.gov.in వెబ్ సైట్‌లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్, సదరం సర్టిఫికేట్,ఆధార్ కార్డు,విద్యా ధ్రువీకరణ పత్రాలు,ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువీకరణ పత్రం,తెల్ల రేషన్ కార్డు తదితర పత్రాలను జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐడీఓసీ కలెక్టరేట్‌లో ఉన్న మహిళా, శిశు,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నంబర్ G-33లో జనవరి 31లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7799866325 నంబర్‌ను సంప్రదించాలని అన్నారు.