జానకిపురం గ్రామంలో నిరుపేద కు స్వయంకృషి ఉపాధి గ్రామ పెద్దలు అండ

అడ్డగూడూరు 07 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పదవిలోని జానకిపురం గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో చింత పరశురాములు తండ్రి వీరయ్య నూతన పంచారు షాపును ఏర్పాటు చేయడం జరిగింది.పరశురాములు చిన్నతనంలోనే పోలియో మహమ్మారికి గురై ఒక కాలును కోల్పోయాడు చిన్నతనంలోనే తల్లి ని కోల్పోయి అనేక ఇబ్బందులతో జీవనం సాగుతున్నట్లు తెలిపాడు ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలు తనకు స్వయం ఉపాధి కల్పించాలని ఇట్టి కార్యక్రమం ద్వారా తెలియజేశారు.గ్రామ పెద్దలను సహకారంతో పంచారు షాపు ప్రారంభించినట్లు తెలిపాడు దీనికి గ్రామ ప్రజల సహకారం ఉండాలని రాజకీయ నాయకుల తోడ్పాటు ఉండాలని పరశురాములు అన్నారు తనకు ఆర్థిక సాయం అందించినట్లయితే పంచారు షాప్ కు సంబంధించిన నూతన పనిముట్లు తెచ్చుకోగలను అని తెలిపారు