జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల స్పందన

Jun 22, 2024 - 18:36
Jun 23, 2024 - 19:19
 0  92
జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి

ఇండ్ల స్ధలాలు, హెల్త్ కార్డులు, వేతనాల అమలుపై త్వరలోనే కార్యాచరణ

టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చలసాని శ్రీనివాస రావు

సూర్యాపేట; 22 జూన్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- జర్నలిస్టు లు గత పదేళ్ల నుండి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, హెల్త్ కార్డులు పని చేయక పోవడం, ఇళ్ల స్ధలాలు ఇవ్వకపొవడం వలన నిరుపేద జర్నలిస్టు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చలసాని శ్రీనివాస రావు అన్నారు. జర్నలిస్టుల కు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు గత ప్రభుత్వ పెద్దలను కలిసినప్పటికి పట్టించుకోలేదని అన్నారు. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు.  ఖమ్మంలో జూన్ 18,19,20 వ తేదీలలో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర మహాసభలలో జర్నలిస్టుల సమస్యల పై సుదీర్ఘమైన చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు జర్నలిస్టు ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు. 

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి  జర్నలిస్టు ల సమస్యలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారని అన్నారు. జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టు లకు న్యాయం చేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. జర్నలిస్టులకు పత్రికా యాజమాన్యాలు వేతనాలు ఇచ్చే విధంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) తరపున త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. సూర్యాపేట పట్టణంలో, నియోజకవర్గం లో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే విధంగా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని కలిసి మాట్లాడుతామని అన్నారు.  సూర్యాపేట జిల్లా లో జర్నలిస్టు లకు శిక్షణా తరగతులు నిర్విస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత 35 సంవత్సరాలుగా చలసాని శ్రీనివాసరావు పోరాటం చేశారని అన్నారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన తానున్నానంటూ చలసాని శ్రీనివాసరావు ముందు వరుసలో నిలుచున్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా  ప్రముఖ పాత్రికేయులు చలసాని శ్రీనివాస రావును రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఐజేయు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించడం పట్ల సూర్యాపేట జిల్లా యూనియన్ పక్షాన శుభాకాంక్షలు చెబుతూ యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస రావును మేమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బత్తుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయ్, సీనియర్ జర్నలిస్టు లు బొజ్జ ఎడ్వర్డ్, తల్లాడ చందన్, రామకృష్ణ, కొండ్లె కృష్ణయ్య, కనుకు రవి, నాగరాజు, మామిడి శంకర్, శ్రవణ్, పడిసిరి వెంకట్, శంకర్, పాషా, కంఠం గౌడ్,, జనార్ధన చారి, శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333