జర్నలిజానికే వన్నె తెచ్చిన డాక్టర్ బంటు కృష్ణ
జర్నలిజంలో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయం
జర్నలిస్టులకు ఆదర్శప్రాయలు బంటు కృష్ణ
టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా గోల్డ్ మెడల్స్ సాధించిన బంటు కృష్ణకు ఘన సన్మానం
సూర్యాపేట. 2 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- టీయూడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పిహెచ్ డి పూర్తైన సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా బంగారు పథకాన్ని అందుకోవడం అభినందనీయమని టి యు డబ్ల్యూ జె ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో టి యు డబ్ల్యూ జె ఐజేయు, సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూలే బొకేలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్దికంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పట్టు వదలని విక్రమార్కుడిలా, సీనియర్ జర్నలిస్టు గా మూడు దశాబ్దాలుగా పైగా జర్నలిజం రంగం లో రాణిస్తూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. జర్నలిజాన్నే ఒక వృత్తిగా భావిస్తూ, అనేక జాతీయ, అంతర్జాతీయ కథనాలు రాస్తూ సమాజాన్ని జాగృతం చేయడం లో ఎంతో శ్లాఘనీయమని చెప్పారు. ఇటీవల జర్నలిస్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్ట్ ల సమస్యల పై ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారం అవుతుందని పేర్కొన్న సంగతి గుర్తు చేశారు.
తోటి సహచర జర్నలిస్టులకు బంటు కృష్ణ ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో టీయూడబ్ల్యు ఐజెయు నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్ కుమార్, టిఎస్ జేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, టి యు డబ్ల్యూ జే ఐజేయు సీనియర్ జర్నలిస్ట్ లు సుంకర బోయిన వెంకటయ్య, కొండా శ్రీనివాసరావు, ఏబియన్ మల్లేష్,కందుల నాగరాజు, ఉయ్యాల నర్సయ్య, గోపన బోయిన రవి, కొండ్లె కృష్ణయ్య ,వాసా చంద్ర శేఖర్, అమృ నాయక్, రవి, రమేష్, వేల్పుల ప్రవీణ్, రామచంద్ర రాజు, జహీర్, బాలు, ప్రభాకర్, శంకర్, అనీల్, శంకర్, లక్ష్మణ్, సుమన్, రాము,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన అందరికీ పేరుపేరునా బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి మోతే మండల విలేకరులు పల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బంటు కృష్ణను సన్మానించారు.