చేయూత అందించిన అధికారికి ధన్యవాదాలు.

మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్.

Aug 8, 2026 - 01:20
 0  2
చేయూత అందించిన అధికారికి ధన్యవాదాలు.

జోగులాంబ గద్వాల ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా పరిధిలోని వెంకంపేట యుపిఎస్ పాఠశాలలోని పేద విద్యార్థులకు డిజిటల్ విద్యాభివృద్ధి కోసం సీఐ విజయవర్ధన్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం పాఠశాలలో దాత విరాళంగా అందించిన టీవీని విద్యార్థులకు బహుకరించారు. దాత గద్వాల నివాసి కె వెంకట రాములు రిటైర్డ్ ఉపాధ్యాయులు  కుమారుడైన హైదరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధి కోసం చిన్న సహాయం అందివ్వడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మండల విద్యాధికారి పేర్కొన్నారు. నేటి యుగములో దృశ్యం ద్వారా పాఠాలను బోధించడం వల్ల విద్యార్థులకు విషయాలు సులభంగా అర్థమవుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంపయ్య. ఉపాధ్యాయులు రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333