భూముల కొలతలసర్వే లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు.
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండల భూముల సర్వేయర్ 23/7/2026 నాడు నవీన్ కుమార్ రెడ్డి ప్రమోషన్ పై వెళ్లడం జరిగింది. అప్పటినుంచి ఈరోజుటి వరకు 7/8/2026 వరకు మండలంలో భూముల కొలతల సర్వేయర్ లేక మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండలంలోని ప్రజల నుంచి తెలుస్తుంది. మరి కొంతమంది ప్రజలు మీసేవ కేంద్రాలలో భూమి కొలతల గురించిఆన్లైన్ చేసుకొని కొంతమంది ప్రజలు ఉన్నారు. మండలంలో మొత్తం గ్రామాలు 23 ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతఅధికారులు స్పందించి ఇటిక్యాల మండలానికి భూముల కొలతల సర్వేయర్ ను ఏర్పాటు చేయాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.