చెంచు ప్రజలకు వంట పాత్రలు పంపిణీ
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం గద్వాల అదే విధంగా విద్యుత్ ఉద్యోగులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ బృందం ద్వారా మంగళవారం కోళ్లం చెంచుపేట అమ్రాబాద్ మండలంకు వెళ్లి కొల్లం చెంచుపేటలో నివసిస్తున్నటువంటి 16 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి రూ .4,200 విలువగల వంట పాత్రలు (స్టిల్ బిందెలు,ప్లేట్స్,వాటర్ జగ్గులు,ప్లాస్టిక్ బాక్కెట్ వాటర్ గ్లాసెస్, వంట చేసుకునే భోగణేలు )మొదలైనవి అందజేశారు. అదేవిధంగా వంట సరుకులు, దుస్తులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళ్ళెం శ్రీనివాసరెడ్డి, భాస్కర్,సలీం,అశోక్,సర్వేశ్వర్, రాజశేఖర్ పాల్గొన్నారు.