చిన్నపిల్లల  స్పెషలిస్టులు శిశు మరణాల పై సమీక్ష సమావేశం.

Mar 18, 2024 - 18:25
 0  9
చిన్నపిల్లల  స్పెషలిస్టులు శిశు మరణాల పై సమీక్ష సమావేశం.
చిన్నపిల్లల  స్పెషలిస్టులు శిశు మరణాల పై సమీక్ష సమావేశం.

జోగులాంబ గద్వాల 18 మార్చ్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. తేదీ.18.3.2024 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. శశికళ  మరియు  డిప్యూటీ. డి ఎం  హెచ్ ఓ, డాక్టర్ ఎస్ కే. సిద్ధప్ప , మాతా శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి .స్రవంతి , ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. రాజు (NCD) ,జిల్లా ఆస్పత్రి వైద్యులు డాక్టర్. శ్యామ్ మరియు డాక్టర్. అశోక్ (చిన్నపిల్లల స్పెషలిస్టులు) "" శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు""... ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,  "ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలను(High Risk Ancs) తప్పనిసరిగా జిల్లా ఆస్పత్రిలో నిపుణులైన గైనకాలజిస్ట్ డాక్టర్ ద్వారా పరీక్షలు నిర్వహించేటట్లు చూడాలని తెలిపారు.. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత ఉండటం , ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత జ్వరము ఉండడం , పసవానికి ముందు ప్రసవం తర్వాత నెల వరకు అధిక రక్తస్రావం కావడం, గర్భిణీ స్త్రీ కి మూర్చ, తలనొప్పి, వాంతులు, చాతిలో నొప్పి ,కాళ్లవాపులు  ఉన్నచో కాన్పు కష్టమై శిశు మరణాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య కార్యకర్తలు ఆశలు ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటట్లు చూడాలని కోరారు.. అదేవిధంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలి, శిశువును వెచ్చగా ఉంచాలి, బొడ్డుతాడును పొడిగా ఉంచాలి, బొడ్డుతాడుకు ఏమి రాయకూడదు, శిశువును అనారోగ్యంగా ఉన్నవారి నుండి దూరంగా ఉంచాలి, శిశువు 2.5 కిలోగ్రామ్ కన్నా తక్కువ ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి... ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గృహ సందర్శన చేసినప్పుడు శిశువు పాలు సరిగా తాగుతున్నదా  లేదా గమనించాలి అదేవిధంగా  వేగంగా శ్వాస తీసుకోవడం, పక్కటెముకలు ఎగురవేయడం, తీవ్రమైన దగ్గు లేదా జ్వరం ఏమైనా ఉందా అదేవిధంగా బొడ్డుకు చీము ఏమైనా పట్టిందా , కామెర్లు ఏమైనా ఉన్నాయా, మూత్ర విసర్జన మలవిసర్జన రోజుకు ఎన్నిసార్లు అవుతున్నది అనే విషయాలు తల్లిని అడిగి తెలుసుకుని ఈ లక్షణాలు ఉన్నట్లయితే శిశువును తొందరగా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసినచో శిశు మరణాలను అరికట్టవచ్చునని తెలిపారు..

     ఈ  సమావేశంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల వైద్యాధికారులు, అర్బన్ హెల్త్ సెంటర్స్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కే. మధుసూదన్ రెడ్డి, తిరుమలేష్ రెడ్డి, వరలక్ష్మి, ప్రమోద, మరియు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333