ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి .మండల కేంద్రంలోని:- ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మొదటగా పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే భారతదేశానికి 1947 వ సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అన్ని హక్కులు కల్పించుకోవడం కోసం భారత రాజ్యాంగం అవసరం కనుక రాజ్యాంగం రాయడం కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఎంతైనా ఉంది అంటూ విద్యార్థులకు తెలియపరిచారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రాయడం కొరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నారు దీన్ని రాయటం కొరకు పట్టిన కాలపరిమితి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అని అందుకోసం ఆ రోజు భారత రాజ్యాంగం అమలుపరచిన రోజున స్వేచ్ఛ వాయువులు భారతదేశంలో సంచరించుకోవాలి అంటే మన అందరి నడవడిక భారత రాజ్యాంగం పట్లనే నడవాలి అంటూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వాతంత్ర పోరాట యోధుల వేషధారణలతో నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం చదువులలో మరియు ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. తర్వాత విద్యార్థులకు స్వీట్లు , బిస్కెట్లు పంచిపెట్టి విద్యార్థులందరికీ 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి , డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి , కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి , ప్రిన్సిపాల్ నందిని కేని , అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు..