ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
తిరుమలగిరి 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- బంజారా భవన్ లో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు బంజారా భవన్ లో నిర్వహించిన లంబాడ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ అహింస, సత్యం, ఆయుర్వేద ప్రకృతి వైద్యం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అందించిన మహానీయులని కొనియాడారు. అనంతరం బంజారా భవన్ కు డీజే సౌండ్ సిస్టమ్ బహుకరించిన ఎఐబిఎస్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షులు లావుడ్య బాలాజీ నాయక్ ను నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ లూనావత్ పాండు నాయక్, కో కన్వీనర్ లు ధరావత్ వీరన్న నాయక్, గుగులోతు నాగు నాయక్, సభ్యులు ధరావత్ ఛత్రు నాయక్, లావుడ్య బాలాజీ నాయక్, ధరావత్ రెడ్యానాయక్, భూక్యా పూల్ సింగ్ నాయక్, వాంకుడోతు వెంకన్న(వివి) నాయక్, బాలు నాయక్, భగ్గులాల్ నాయక్, అజయ్ నాయక్, భూక్యా మహేష్ నాయక్, నాయకులు బానోతు పూరియా నాయక్, మోతీలాల్ నాయక్, వస్రం నాయక్, నాగు నాయక్, గుగులోతు వీరన్న నాయక్, రాజేష్ నాయక్, వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.