ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం

Feb 23, 2026 - 13:45
Feb 23, 2026 - 13:46
 0  67
ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం

*ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం*

 వెంకటాపురం తెలంగాణ వార్త :- వెంకటాపురం ZPSS పాఠశాల యందు తెలంగాణ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకి BASE LINE పరీక్షను నిర్వహించడం జరిగినది. ఈ పరీక్ష పరిశీలకులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ నుండి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ పీర్ల కృష్ణ బాబు మరియు మండల విద్యాశాఖ అధికారి GVV సత్యనారాయణ AI కోఆర్డినేటర్ CH శేష నర్సింహారావు మరియు BOLLE శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఓపెన్ స్కూల్లో చేరినటువంటి పదోతరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు అంతర్గత సామర్థ్యాలను వెలికి తీసే విధంగా వారిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం(ONLINE )ద్వారా బేస్ లైన్ పరీక్షలను తెలుగు ఇంగ్లీషు గణితము సైన్సు మరియు సోషల్ విభాగాలలో పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ పరీక్షలకు పదోతరగతి నుండి 63 మంది విద్యార్థులు మరియు ఇంటర్ నుండి 71మంది విద్యార్థులు హాజరైనారు. వీరికి ఏప్రిల్ 20 నుండి పరీక్షలు నిర్వహించబడును.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్