ఘనంగా శ్రీశేష దాసుల రథోత్సవం
జోగులాంబ గద్వాల 5 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. ఆదిశిల క్షేత్రం మల్దకల్ లో కొలువైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మధ్యారాదన సందర్భంగా అవమాన హోమం నిర్వహించారు. శ్రీ శేషదాసుల ఉత్సవ విగ్రహం తో రథోత్సవాన్ని వందలాది భక్తుల మధ్య నిర్వహించారు. దేవాలయం నుండి శేషదాసుల కట్ట వరకు నిర్వహించి అనంతరం వేద పండితులు మంత్రాలయం రాఘవేంద్ర చారి, పవమానాచారి, బెంగళూరు గురు ప్రసాద్ చారి, హైదరాబాద్ జయ రామాచారి, శశాంకదాస్ లు పురాణ ప్రవచనాలు వినిపించారు. అనంతరం వెంకోబరావు కుమారుడు వరదెంద్ర సంగీత కచేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేషదాస వంశీయులు శేషగిరిరావు, దీరేంద్ర దాస్, రాఘవేంద్ర దాస్, విష్ణు ,శశాంక, ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, భీమసేన చారి, ప్రసన్న చారి చాగాపురం ప్రదీప్, మోహన్ రావు,రమేష్, గిరి రావు, మధుసూదన్ రావు, బాబురావు, మనోహర్ రావు, సీతారామరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.