ఘనంగా మేడే ఉత్సాహాలు కార్మికుల హక్కులపై సాధన కోసం పోరాటాలలో పాల్గొనాలి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

May 1, 2025 - 18:55
May 1, 2025 - 20:29
 0  6
ఘనంగా మేడే ఉత్సాహాలు కార్మికుల హక్కులపై సాధన కోసం పోరాటాలలో పాల్గొనాలి

తెలంగాణ వార్త మాడుగుల పల్లి మే 1 : ఈరోజు మాడుగులపల్లి మండల కేంద్రంలోకార్మికుల హక్కుల సాధన కోసం నాటి కార్మికుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు.గురువారం కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా 12 గం.ల పని విధానం రద్దు చేయాలని,పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలని,వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం కార్మికులు పోరాడి విజయం సాధించిన రోజుకు ప్రతీకగా ప్రతి ఏటా మేడే ను జరుపుకుంటామన్నారు.ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదంతో కార్మికులు ఏకమై ఉద్యమాలు చేశారన్నారు.నాటి కార్మిక పోరాటాలలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులయ్యారు అన్నారు.కానీ ఈ దేశంలో ఇప్పటికి 8 గం.ల పని విధానం పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదన్నారు.అనేక చోట్ల రోజుకు 12,14 గం.ల పని చేయిస్తున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు.29 రకాల చట్టాలను 4 కోడ్ లుగా మార్చి మళ్ళీ కార్మికులను వెట్టి చాకిరీ చేయించేందుకు కార్పోరేట్ లకు లాభం చేకూర్చే విధంగా ఉందన్నారు.29 రకాల కార్మిక చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చి సమ్మె చేసే హక్కును,యూనియన్ లను ఏర్పాటు చేసుకునే హక్కూలను కాలరాస్తుందన్నారు.మరోవైపు రైతులకు,రైతు కూలీలకు గిట్టుబాటు ధరలు, వేతనాలు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ప్రతి కార్మికుడికి నెలకు 26000 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు.ఉద్యోగ భద్రత, జీవనోపాధి , నైపుణ్యాభివృద్ధి కల్పన విషయంలో ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించి కార్మికుల హక్కులను కాపాడాలన్నారు.8 గం.ల పని విధానం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు.కార్మికుల హక్కుల కోసం నాటి నుంచి నేటి వరకు అనునిత్యం పోరాడేది ఎర్రజెండా అన్నారు.నాటి కార్మికుల పోరాట స్ఫూర్తితో నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయాలన్నారు.కార్మిక ,కూలి సంఘాల్లో సభ్యత్వం తీసుకొని కార్మికుల హక్కుల పోరాటాలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల సీనియర్ నాయకులు దేవి రెడ్డి అశోక్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు పుల్లెంల శ్రీకర్, నగిరె కృష్ణయ్య, జూకూరి నాగయ్య,గడగోజు వెంకటాచారి, కన్నయ్య, మండల నాయకులు కట్ట సతీష్ రెడ్డి, పర్శరాములు,లింగస్వామి ,మాధవ్ ,వెంకన్న ,వెంకట్ రెడ్డి, వెంకయ్య,పద్మ, లక్ష్మమ్మ, మాధవి, ఇద్దమ్మ, మహేశ్వరి,యాదమ్మ, ప్రమీల,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333