ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

Feb 26, 2025 - 20:40
 0  2
ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా మహా శివరాత్రి వేడుకలు* మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శివాలయాలు పోటెత్తిన భక్తుల అభిషేకాలు.. ఆత్మకూర్ ఎస్.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని గ్రామాల్లో అన్ని దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఏపూరు, నెమ్మికల్, కందగట్ల, ఏనుబాముల ,గట్టికల్, పాతర్లపహాడ్, ఆత్మకూర్ గ్రామాల్లోని పురాతన శివాలయాల్లో అభిషేకాలు,అన్నదానాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపూరులో నేటినుండి శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండలంలోని భక్తులు శివరాత్రి ఉపవాసాలు కొనసాగిస్తున్నారు.