ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు

Sep 26, 2024 - 18:14
 0  9
ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు

 పూల మాలలు వేసి నివాళులు అర్పించిన బోయలగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు మరియు రజక సంఘం నాయకులు.....

భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన పోరాటంలో నిప్పుకణికగా నిలిచి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ గారని బోయలగూడెం గ్రామ ప్రజా ప్రతినిధులు అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర చాకలి ఐలమ్మ చిత్రపటానికి బోయాలగూడెం గ్రామ ప్రజా ప్రతినిధులు మరియు రజక సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ...

నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ గారని తెలిపారు. దొరల దాష్టీకానికి ఎదురుతిరిగి తన పంట గింజలు రక్షించడమే కాకుండా, నాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ సాయుధ పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ  గారి పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో M. రామాంజనేయులు,పెద్ద వీరేష్ గౌడ్,ఎండి కాసిం,గిర్ని తిమ్మప్ప,వాల్మీకి నాగరాజు,కురువ విరేష్,ఎంపీటీసీ నర్సప్ప,ముళ్ళ కాసిం,చాకలి జగదీష్,శేఖర్,చాకలి శాంతు,చాకలి రాముడు,చాకలి భీమన్న,చాకలి కృష్ణ, చాకలి తిమ్మప్ప మరియు రజక సంఘం నాయకులు,గ్రామ యువకులు, పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333