గురుకుల పాఠశాలను అయిజలోనే కొనసాగించాలని
ఎమ్మెల్యే విజయుడు కి వినత పత్రాన్ని అందజేసిన అయిజ ఎమ్మార్పీఎస్ మాదిగ రాజు,
జోగులాంబ గద్వాల 9ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్. నియోజకవర్గo అయిజ మండల కేంద్రంలో స్థానిక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయిజ పట్టణానికి మంజూరైన ప్రభుత్వ గురుకుల పాఠశాలను తిరిగి అయిజ లోనే ఏర్పాటు చేయాలని కోరుతూ అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ పాఠశాలను అయిజ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవల్లికి తరలించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరం (2026-27): వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా పాఠశాలను తిరిగి అయిజ పట్టణానికి తీసుకురావాలని ప్రతినిధులు కోరారు. మున్సిపల్ చైర్మన్ సి.ఎం. సురేష్ గారి తో కలిసి అయిజ రాజు మాదిగ మరియు ఆయన బృందం ఈ వినతి పత్రాన్ని అందజేసి, సమస్య తీవ్రతను ఎమ్మెల్యేకి వివరించారు."అయిజ విద్యార్థుల సౌకర్యార్థం మంజూరైన పాఠశాల వేరే ప్రాంతానికి తరలిపోవడం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోంది. తక్షణమే స్పందించి దీనిని తిరిగి ఐజకు తీసుకురావాలనిఅయిజ ఎమ్మార్పీఎస్ రాజు అన్నారు,