గుంటూరులో మూడు వికెట్లు

- తాడేపల్లిలో రెండు తెనాలిలో ఒకటి

May 3, 2026 - 18:08
 0  1
గుంటూరులో మూడు వికెట్లు

జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది పనితీరుపై ఎస్పీ వకుల్ జిందల్ మార్గదర్శకాలు వెలువరించిన 24 గంటల్లోనే గుంటూరులో టపటపా మూడు వికెట్లు పడ్డాయి.

గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలీసు స్టేషన్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు, పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమే కాక, అసాంఘిక కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం అవుతున్న ఇద్దరు కానిస్టేబుల్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. తాడేపల్లి హెడ్ కానిస్టేబుల్ ఏ.వి.రమణ, కానిస్టేబుల్ సిహెచ్.రామును సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేసారు.

తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ విధుల దుర్వినియోగం (అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం) చేసిన హెడ్ కానిస్టేబుల్ చెంగల రాయుడును కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333