గాంధినగర్ లో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

సూర్యాపేట తహసీల్దారు శ్యామ్ సుందర్ రెడ్డి..
సూర్యాపేట, 07 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని సూర్యాపేట తహసీల్దారు శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట రూరల్ మండలం గాంధినగర్ లో పిఎసిఎస్ పిల్లలమర్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట తహసీల్దారు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి సూర్యాపేట మండలంలో 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు, ఐకెపి ఆధ్వర్యంలో 23 కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు మొత్తం 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత 48 గంటలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రవాణా చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేసవికాలం కాబట్టి తేమశాతం తక్కువగానే వుంటుందని, ఒక వేళ అకాల వర్షాలు వచ్చినప్పటికి ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేయాలని రైసు మిల్లర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సందీప్,ఎఈవొ స్వాతి, పిఎసిఎస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, నాగరాజు, నవకాంత్, వీరయ్య , రైతులు పాల్గొన్నారు.