గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలే శ్రీ రామ రక్షా  డాక్టర్"భరత్ కుమార్

Feb 17, 2025 - 20:13
 0  79
గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలే శ్రీ రామ రక్షా  డాక్టర్"భరత్ కుమార్

అడ్డగూడూరు 17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంతు ఆదేశాల మేరకు ఎంపిడిఓ శంకరయ్య ఆధ్వర్యంలో  అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామ పంచాయతీలో భాషబోయిన రమ్య అనే గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్లి,రమ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని,డెలివరీ కొరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవాలని తెలిపారు.గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఆసుపత్రులు శ్రీ రామ రక్షా అని అన్నారు.వారికున్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవడానికి వారిని ఒప్పించడం జరిగింది.తదుపరి తల్లీ బిడ్డ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్ లతో కూడిన న్యూట్రిషన్ కిట్ ను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్"భరత్ కుమార్ రాథోడ్,పంచాయతీ  కార్యదర్శి రమేష్,పి.హెచ్.సి సూపర్వైజర్,ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333