నల్లగొండలో చేయూత ఆశ్రమం అవిర్బావం

Feb 17, 2025 - 20:14
 0  8
నల్లగొండలో చేయూత ఆశ్రమం అవిర్బావం
నల్లగొండలో చేయూత ఆశ్రమం అవిర్బావం

లోగో,వాల్ పోస్టర్,వెబ్ సైట్ అవిష్కరణ చేసిన ఫౌండర్ & చైర్మన్ గోలి ప్రభాకర్
హాజరైన బత్తుల గణేష్,పెద్ది జగన్
నల్లగొండ 17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్లగొండ జిల్లా కేంద్రంలో జాతీయ నిరుపేద నిర్బాగ్య దివ్యాంగుల చేయూత ఆశ్రమంను అవిర్బావం చేశారు.సంస్థ ఫౌండర్,చైర్మన్ గోలి ప్రభాకర్ చేతుల మీదుగా లోగో,వాల్ పోస్టర్,అధికారిక వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి బత్తుల గణేష్, పెద్ది జగన్ లు హాజరయ్యారు.అనంతరం గోలి ప్రభాకర్ మాట్లాడుతూ..సమాజంలో నిరుపేద నిర్భాగ్య దివ్యాoగులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం జాతీయ నిరుపేద నిర్భాగ్య దివ్యాoగుల చేయూత ఆశ్రమం అనే సంస్థ ను ఏర్పాటు చేశామని చైర్మన్ గోలి ప్రభాకర్ అన్నారు.కుటుంబ సభ్యులు ఎవరు లేని నిరుపేద దివ్యాoగుల కావాల్సిన పరికరాలు మరియు విద్యను అభ్యసించడానికి పుస్తకాలు,నోటు బుక్కులు,మరియు ఇతర ఏదైనా సంబందించిన సహకారం అందిస్తామని తెలిపారు.సోమవారం రోజు ఆయన పుట్టిన రోజూ సందర్బంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సంస్థ కార్యాలయం ప్రారంభం సందర్బంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి శాలువాతో సన్మానించి,కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంస్థ వ్యవస్థపాక కమిటీ మరియు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ లక్ష్మి, ఉట్కూరి కృష్ణ,పొట్టేపాక కాశయ్య,బైరి మమత, సుజాత,వెంకటరెడ్డి,వాల్కి శంకర్, ముడుసు కవిత,మౌనిక,వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333