గట్టుసింగారం రైతు వేదికలో  ప్రత్యామ్నాయ పంటలపై రైతులకి అవగాహన సదస్సు 

Jul 31, 2026 - 01:26
Jul 31, 2026 - 01:28
 0  2
గట్టుసింగారం రైతు వేదికలో  ప్రత్యామ్నాయ పంటలపై రైతులకి అవగాహన సదస్సు 

అడ్డగూడూరు 30 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం రైతు వేదికలో రైతులకు మెట్ట పంటల గురించి అవగాహన కార్యక్రమం ఏవో పాండురంగ చారి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఈ సారి వర్షాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉండే అవకాశం ఉన్నందున నీటి  లభ్యతను దృష్టిలో ఉంచుకొని మెట్ట పంటల సాగుకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిచేయడం జరిగింది.అధిక నీటి అవసరం ఉన్న పంటల బదులు స్థానిక పరిస్థితులకి అవరమైన వర్షాధార పంటలను ఎంపిక చేసుకుంటే నష్టాలను తగ్గించవచ్చు,ఈసారి మండలంలో వర్షం సాధారణం కంటే తక్కువ ఉన్నందున వరి సాగు తగ్గించి మెత్త పంటలైన కందులు,సజ్జలు,జొన్నలు, కూరగాయలు వంటి పంటలు వేసుకోవాలని తెలియజేయడం జరిగింది.చెరువులలో, బావులలో,బోరు బావులలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది వరి పంట  ఎండిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు ఆలోచన చేసి పంటల సరళి మార్చాలని తెలిజేయడం జరిగింది. కార్యక్రమంలో స్ధానిక  వ్యవసాయ అదికారి పి పాండురంగాచారి  గట్టుసింగారం స్థానిక సర్పంచ్ ఉపేంద్ర నాగరాజు,పిఏసీఎస్ డైరెక్టర్ అంబాటి జొస్పినమ్మ గార్లు ఏఈఓ ఏ  అనూష,పంచాయతీ కార్యదర్శి వి మాధవి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333