గట్టుసింగారం గ్రామంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుక

అడ్డగూడూరు10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు పిల్లలే ఉపాధ్యాయులై పాఠశాలలో సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఇలా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని పిల్లలు ఆనందంతో సోమవారం రోజున గడిపారు పిల్లల తల్లిదండ్రులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల పిల్లలలో మానసిక ధైర్యాన్ని గురువుల పట్ల అమితమైన గౌరవాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయని పాఠశాలలోని ఉపాధ్యాయురాలు ప్రియాంక సంధ్యా పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమంలోని స్కూల్ హెడ్మాస్టర్ ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.