గంజాయి మత్తు యువతను పట్టిపీడిస్తోంది

May 23, 2026 - 07:16
 0  217
గంజాయి మత్తు యువతను పట్టిపీడిస్తోంది

తిరుమలగిరి 23 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్  ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది  తిరుమలగిరి మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. గాంజా లాంటి మాదకద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో మండల కేంద్రంలో హోటల్స్, షాపింగ్ మాల్స్, టీ దుకాణాలు, పాన్ డబ్బాలు, మెడికల్ దుకాణాలు, కూరగాయల దుకాణాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు సోదాలు నిర్వహించామని అన్నారు. ప్రస్తుత సమాజంలో గాంజాయి లాంటి మాదకద్రవ్యం మన యువతని సమాజాన్ని పట్టిపీడిస్తుందని దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని అన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించి ఉపయోగించేవారు ఉన్నా సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి