ఖమ్మం నగరం లో అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ
ప్రైవేటు భవనాలు మరియు స్కూల్ భవనాలను వెంటనే తొలగించాలి.
జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్
ఖమ్మ నగరం మునుపెన్నడూ లేని విదంగా పెను తుఫానుకి వరదలో చిక్కు కోవటం విచారకరమని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసారు. జిల్లా వ్యాపితంగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి మరణించటం భాదాకరం, ఖమ్మం నగరంలో చెరువు శిఖాలు కాల్వ కట్టల వెంట బహుళ అంతస్తులను ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించటం వలనే ఈ దుస్ధితికి కారణమని అలాంటి భవనాలను అపార్ట్ మెంట్లను హైదరాబాద్ హైడ్రా తరహాలో ప్రభుత్వం కూల్చివేయాలని వారు డిమాండ్ చేసారు. విధ్యార్ధులు చదువుకునే పలు ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలు కళాశాలలు సైతం వరదలో మునగటం ఆందోళన కలిగిస్తుందని విధ్యార్ధులు చదువుకుంటున్న తరుణంలో భారీ వర్షం కురిస్తే ఆ వరదల్లో చిక్కుకుని విధ్యార్ధులు బయటకు రాని పరిస్ధితి ఏర్పడుతుందని వరద తాకిడి కి విధ్యార్ధులకు ప్రమాదం జరిగే అవకాశం వుందని అలాంటి కళాశాలలను వెంటనే కూల్చి వేయాలని వారన్నారు. అలాగే జిల్లా లో పేదలు రైతు కూలీలకు వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని వరదల్లో మరణించిన వారికి 25 లక్షలరూపాయలు, రైతు పైరు నష్టపోయిన వారికి ఎకరాకు 50 వేలరూపాయలు, ఇండ్లు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు అత్యవసర నిమిత్తం వరద బాదితులందరికి కుటుంబానికి 25 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి వారిని ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే పశువులు, మేకలు, గొర్లు,కోళ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారంచెల్లించాలని వరదలలో వాడుకునే గృహపరణాలకు నష్టపరిహారం ఇవ్వాలని వంటసామాను కూడ వరదల లో కొట్టుకు పోయి కట్టుబట్టలతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎత్తైన ప్రదేశంలో 3 రోజులు వర్షంలో తడుస్తూ తలదాచుకున్నారని వారన్నారు. ఇంటర్మీడియట్ నుండి ఆపై చదువుతున్న ప్రతి విద్యార్థికి ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్దులకు Laptap లు కూడా కొట్టుకుపోయినందున వారికి Laptap లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కావున ప్రభుత్వం వరద భాదితులని అన్ని విదాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో వరద బాదితులను స్వయంగా ఆయనే JCB మరియు బుల్డోజర్లలో తిరుగుతూ పగలనక రేయనక 24 గంటలు వరద భాదితులకు ఆహారం మంచినీరు తదితర సామాగ్రి ని ఆయనే స్వయంగా పంచటం, హెలికాప్టర్లు, డ్రోన్ల మరబోట్లు సహాయంతో అత్యాధునిక వాహనాలతో ఏవిదంగా వరద భాదితులను ఆదుకుంటున్నారో చూసి నేర్చుకోవలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి మండలికి అధికాయంత్రాంగానికి హితవు పలికారు. కావున వరద భాదితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్, కేతినేని హరీష్, మల్లెంపాటి అప్పారావు నగర నాయకులు నాగండ్ల లక్ష్మన్, చింతనిప్పు నాగేశ్వరరావు, ఓర్సు కృష్ణ, తాళ్లూరి సత్య నారాయణ మరియు కొండబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.