ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఆహ్వానం""ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐ ప్రభాకర్

Apr 28, 2026 - 18:47
Apr 28, 2026 - 19:33
 0  38
ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఆహ్వానం""ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐ ప్రభాకర్

ప్రెస్ మీట్ సమాచారం

దయచేసి ప్రతి ఒక్కరు ఈ న్యూస్ ను కవర్ చేయగలరని విజ్ఞప్తి.

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ::ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఆహ్వానం.

ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ. ప్రభాకర్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.

ఈ సమావేశం గట్టయ్య సెంటర్‌లోని మహారాష్ట్ర బ్యాంక్ భవనం పై 2వ అంతస్తులో జరగనుంది. ప్రెస్ క్లబ్ కార్యకలాపాలు, జర్నలిస్టుల భాగస్వామ్యం, సంఘ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృత చర్చ జరుగుతుందని వారు పేర్కొన్నారు.

వచ్చే నెల మే 3వ తేదీన నిర్వహించనున్న ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక చర్చాగోష్టి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నూతన సభ్యత్వాల నమోదు, కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. జిల్లాలోని అన్ని మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని అధ్యక్షులు ఐ. ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State