ట్రాఫిక్ విధులపై సిబ్బందికి శిక్షణ..
సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి విధులు నిర్వహణ, ట్రాఫిక్ ఆజ్ఞలు, గుర్తులు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై పోలీసు స్టేషన్ నందు శిక్షణ ఇవ్వడం జరిగినది. విధులు నిర్వహణలో అప్రమత్తంగా ఉంది ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్దరణ చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపినారు. చేయాల్సిన విధులపై సిబ్బందికి అవగాహన ఉన్నప్పుడే సమర్థవంతంగా ప్రజలకు, వాహనదారులకు సేవలు అందించవచ్చు అని సూచించారు.