క్రీడలు శారీరక మానసిక దృఢత్వాని పెంచుతాయి.అమిన్ సింగ్

Jan 29, 2026 - 20:34
 0  2
క్రీడలు శారీరక మానసిక దృఢత్వాని పెంచుతాయి.అమిన్ సింగ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ క్రీడలు శారీరక మానసిక దృఢత్వాని పెంచుతాయి. ఆత్మకూర్ ఎస్ సూర్యాపేట. క్రీడలు పిల్లల్లో శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని, క్రీడల వలన మానవ సంబంధాలు మెరుగుపడతాయని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా విద్యార్థులను క్రీడల్లో నైపుణ్యం వచ్చేలా కృషి చేయాలని మండల తహసిల్దార్ అమీన్ సింగ్ అన్నారు. సీఎం కప్ మండల స్థాయి క్రీడలను గురువారం గురువారం మండల కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లకు టీవీలకు దూరంగా ఉండి క్రీడల్లో నైపుణ్యత సాధించాలని అన్నారు. క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి భవిష్యత్తులో ఉద్యోగాలలోను రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో తప్పనిసరిగా క్రీడలు నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హసీం, ఎంఈఓ ధారాసింగ్ ఎం పి ఓ ప్రసన్న, ఆత్మకూరు సర్పంచ్ ములకలపల్లి కాటయ్య, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, పిఈటి లు లింగాల రవి, సైదులు లింగయ్య శ్రీదేవి అరుణ ధనమూర్తి వసంత హెలెన్ తదితరులు పాల్గొన్నారు.