కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

17-02-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: చిన్నంబావి మండలం లో వాల్మీకి విగ్రహ చివరస్తా దగ్గర తెలంగాణ రాష్ట ప్రదాత జన వృదయ నేత తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు 71 వ జన్మదిన శుభ సందర్భంగా చిన్నంబావి మండల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ మాజీ తాజా ప్రజా ప్రతినిధులు మండలపార్టీ నాయకుల ఆధ్వర్యంలో 71 వ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల పార్టీల నాయకులు కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి, మండల మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షులు తగరం లక్ష్మీ కుర్మయ్య, సింగల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, రామకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, తిరుపాలు, సుందర్ రెడ్డి, పాండయ్య,మద్దిలేటి, స్వాములుయాదవ్ , శరత్ కుమార్ రెడ్డి, రాజు, మేకల కృష్ణ, శివారెడ్డి, బాలపిరు, కురుమయ్య, బాబు యాదవ్, మధు, చంద్రుడు,గోపాల్, ఎస్ నరసింహ,క్రాంతి ఉదయ్,శాలు,యువ నాయకులు జి. సాయికుమార్, సుమంత్, వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు.