కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కట్ట

ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో - ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలంలోకి వెళ్లే దుస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరవుతున్న రైతు ఆంజనేయులు
ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసిన కానీ - స్పందించడం లేదని ఆవేదన చెందుతున్న రైతు ఆంజనేయులు
జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ మండలం,జూన్ 12 : మల్దకల్ మండల కేంద్రానికి చెందిన వడ్డెమ్ బాయి ఆంజనేయులు కు చెందిన సర్వేనెంబర్ 134,మల్దకల్ శివారులో తన పంట పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కట్ట వర్షాకాలం నేపథ్యంలో భాగంగా రోజురోజుకి కూలిపోయే విధంగా ఉన్నదని వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కట్ట నిర్మించేందుకు సహకరించాలని మీడియా ద్వారా కోరారు. వ్యవసాయ పనుల నిమిత్తమై పొలంలోకి అడుగు పెట్టాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలంలోకి వెళ్లే దుస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరయ్యారు.ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై విద్యుత్ అధికారుల కు తెలియజేసిన కానీ స్పందించడం లేదని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.