ఏడేళ్ళ చిన్నారి కి శాస్త్రీయ నృత్య లో నంది అవార్డు

Dec 22, 2024 - 20:23
 0  2
ఏడేళ్ళ చిన్నారి కి శాస్త్రీయ నృత్య లో నంది అవార్డు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఏడేళ్ళ చిన్నారి కి శాస్త్రీయ నృత్య లో నంది అవార్డు ఆత్మకూరు ఎస్.. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 7ఏళ్ల చిన్నారి బుర్రి లక్ష్మి సాయి కి శాస్త్రీయ నృత్యo భారత నాట్య ప్రదర్శన లో ఆదివారం నంది అవార్డు లభించింది.హైదరాబాద్ ఆదర్శ కళానిలయం శాస్త్రీయ నృత్య నిరాజనం వారు నిర్వహించిన కార్యక్రమం డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరం, తెలంగాణ సరస్వతి పరిషత్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించారు ఈ కళా ఉత్సవాలలో ఆత్మకూర్ ఎస్ కు చెందిన బుర్రీ క్రాంతి మౌనిక ల గరిష్ట కూతురు చిరంజీవి బుర్రి లక్ష్మీ సాయి కి భరతనాట్య కళా ప్రదర్శనలో అవార్డు లభించింది.ముఖ్య అతిథులు, సరస్వతి ఉపాసకులు, న్యూమరాలజిస్ట్, దేవజ్ఞ శర్మ చేతుల మీదుగా చిరంజీవి బుర్రి లక్ష్మీ సాయికి నంది అవార్డు ,మెడల్ మరియు ప్రతిభా సర్టిఫికెట్ ను పొందారు. ప్రముఖ గ్రామీణ ఘంటశాల గా గుర్తింపు పొందిన బుర్రీ వెంకటేశ్వర్లు కుమారుని కూతురు లక్ష్మి సాయి ప్రస్తుతం హైదరాబాద్ 3వ తరగతి చదువుతున్నారు. లక్ష్మి సాయి తండ్రి క్రాంతి ప్రైవేటు ఉపాద్యాయులు గా పని చేస్తున్నారు.