కాళేశ్వరం' దోషులెవరో తేల్చండి 

Apr 2, 2024 - 18:20
 0  5
కాళేశ్వరం' దోషులెవరో తేల్చండి 

 విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు ఇరిగేషన్‌ అధికారులు 

 బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విచారణ కార్యాలయం ఏర్పాటు 

 విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు నీటిపారుదల శాఖ అధికారులు.. 

హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని జ్యుడిషీయల్‌ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో కమిటీ చైర్మన్‌ అయిన జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా నేతృత్వంలోని అఽధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్‌బొజ్జాతో పాటు ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ (పీఅండ్‌ఎం) కె.శ్రీనివాస్‌ కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం అపాయింట్‌మెంట్‌ ఉండటంతో ఆయన్ను కలిసి, టీవోఆర్‌ అందించి, కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కేఆర్‌)లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులెవరో గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక అందించాలని ఘోష్‌ను అధికారులు కోరనున్నారు.

ఆ ఏడు అంశాలేంటంటే...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్‌, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలి

కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించాలి

3 బ్యారేజీల్లో ఆపరేషన్‌ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చాలి

క్వాలిటీ కంట్రోల్‌, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరపాలి

నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌-ఈవోటీ), పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించాలి

కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గుతేల్చాలి

ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే.. వాటిపై విచారణ చేయాలి..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333