కాలువ లను పరిశీలించిన ఎమ్మెల్యే

కేటీ దొడ్డి:-మండల పరిధిలోని
పాతపాలెం గ్రామంలో ఇటీవలే కురిసిన భారీ వర్షం కారణంగా పాతపాలెం నీలహళ్లి గ్రామాలకు ప్రధాన రహదారి లో కాలువ తెగిపోవడంతో గ్రామస్తులకు రైతులకు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నది ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం తెగిపోయిన కాల్వలను పరిశీలించడం జరిగింది. వెంటనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని అధికారులకు తాత్కాలికమైన రాకపోకలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు వెంకటన్న గౌడ్, ఆంజనేయులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.