కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దళిత వాడకు సిసి రోడ్డు మోక్షం ఎప్పుడొస్తుందో

Sep 4, 2024 - 16:57
 0  90

అడ్డగూడూరు 4 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామనికి చెందిన దళితులు అసలే కొద్ది రోజుల క్రితం కురుస్తున్న భారీ వర్షాలకు ఏరులై పారుతున్న నీరు కాలు బయటకు వేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు కాస్త ఒరుపు ఇస్తే అవసరాల కొరకు బయటకు వెళ్దామంటే ఇదో పరిస్థితి కాళ్లు బయట వేయలేని పరిస్థితులు అసలే వృద్ధులు, వికలాంగులుగా ఉన్నారు. బయటకు ఎలా వెళ్లాలని ఆలోచిస్తుంటారు.ఈ దళితవాడకు సిసి రోడ్ ప్రభుత్వ పాఠశాల మొదటి బజార్ ఎస్సీ కాలనీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో,జెడ్పిటిసి,ఎంపిటిసి,నిధుల క్రింద మంజూరైన సీసీ రోడ్లు పోస్తానని వచ్చిన బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్(పార్టీలకు సంబంధం లేకుండా గ్రామసేవకుడిగా)మన బజారుకు పూర్తిస్థాయిలో సిసి రోడ్ నిర్మాణం ఉన్నందున పూర్తిగా పోస్తాను కానీ సగం వరకు పోసి ఆపలేమని వచ్చిన అప్పటి గ్రామ సర్పంచిని పిల్లి శ్రీకళ సుందర్ ను సిసి రోడ్ పోయోద్దని వెనక్కి పంపిన వైనం గత సంవత్సరం జరిగింది.వివరాల్లోకి వెళితే ప్రభుత్వ పాఠశాల నుండి మిషన్ భగీరథ నీళ్లు అందించే ట్యాంక్ వరకు మెయిన్ ప్రభుత్వ బజారు ఉండెను కానీ కబ్జాకు గురికావడం జరిగింది.అందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సిసి రోడ్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామ కాలనీవాసులు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.గత మూడు సంవత్సరాల నుండి కనీసం మట్టి కూడా పొయ్యలేని పరిస్థితి దీనికి కారణం బాట  కబ్జాదారుడు రోడ్డ నాగరాజు తండ్రి వెంకటయ్య గత కొన్ని సంవత్సరాల నుండి నోరు పెద్దగా చేసుకుని గవర్నమెంట్ లేఅవుట్ బజారు బాటను దౌర్జన్యంగా రోడ్డ నాగరాజు తండ్రి వెంకటయ్య అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని కొంతమంది వ్యక్తులకు సమాచారం ఉందని తెలుస్తుంది.గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది.కావున ఆ ఒక్క వ్యక్తి వలన చుట్టూన వ్యక్తులు కూడా బజారును కబ్జ చేసుకోవడం జరుగుతుందని అనుకుంటున్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు,గ్రామపెద్దలు,పై అధికారులు,ఎమ్మార్వో ప్రత్యేకమైన చోరువ తీసుకొని సర్వే చేసి పరిశీలించగలరని మనవి గవర్నమెంట్ లేఅవుట్ ప్రకారం బాటను సరి చేయగలరని గ్రామస్తులు,కాలనీవాసులు, కోరుతున్నారు.ఎందరో సర్పంచులు మారుతూ..వస్తు పోయినారు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పటి సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ చొరవతో కొంతవరకు సిసి రోడ్లు నిర్మాణం చేపట్టారు.గ్రామ కాలనీకి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్ నుండి గవర్నమెంట్ స్కూల్ వరకు ఇదే మెయిన్ బజారు అని కొందరు కాలనీవాసులు అంటున్నారు. కొంతమంది వ్యక్తులు బాటను కబ్జా చేయడం వల్ల బాట ఇక్కడ ఉందనే విషయం కూడ మర్చిపోయారు.ఈ బజారులో సీసీ రోడ్డు నిర్మాణం చేపడితే గ్రామంలో ఎంతోమందికి మేలు జరుగుతుందని గ్రామస్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333