కాంగ్రెస్ పార్టీ నిరసన.. -బీఆర్ఎస్ పార్టీ తీరుపై
బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న తీరు పట్ల నిరసన కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇవాళ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతిపక్ష పార్టీ తీరును తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నరసయ్య, హరిదాస్ నగర్ సర్పంచ్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుల్లపల్లి లక్ష్మారెడ్డి మేడిపల్లి రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊడుగుల సురేందర్, ఎడ్ల రాజ్ కుమార్, మూర్తి వెంకటేష్, బండారి బాల్ రెడ్డి గంట వెంకటేష్ గౌడ్ నంది కిషన్ త్యాగం నారాయణ ఉప్పుల రవి గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి, గుర్రవేణి రాజయ్య చెరుకు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.