కస్తూర్బా స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడివో శంకరయ్య

Oct 28, 2025 - 20:21
 0  45
కస్తూర్బా స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడివో శంకరయ్య
కస్తూర్బా స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడివో శంకరయ్య

 అడ్డగూడూరు 28 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని కంచనపల్లి గ్రామంలో కస్తూరిబా స్కూల్ ను ఎంపీడీవో శంకరయ్య తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అక్కడ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం వంట సామాగ్రిని బియ్యం పప్పు నాణ్యమైన కూరగాయలను అందించాలని పరిశీలించారు.విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చదువు అనేది ఒక మంచి ఆయుధం..చిన్న వయసు నుండి చదువుపై శ్రద్ధ చూపాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి సి సూపర్వైజర్ మధురమ్మ, పాఠశాల యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333